1) ఒక ఎకరాకు = 40 గుంటలు 2) ఒక ఎకరాకు = 4840 Syd 3) ఒక ఎకరాకు = 43,560 Sft 4) ఒక గుంటకు = 121 Syd 5) ఒక గుంటకు = 1089 Sft 6) ఒక స్క్వయర్ యార్డ్ కు 3 x 3 = 09 చదరపు ఫీట్లు 7) 121 x 09 = 1089 Sft 8) 4840 Syd x 09 = 43,560 Sft 9) ఒక సెంట్ కు = 48.4 Syd 10) ఒక సెంట్ కు = 435.6 Sft Land Survey కోసం అత్యవసరమైన information... *Common Terminology in Revenue Department* *గ్రామ కంఠం :* గ్రామంలో నివసించేందుsకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి. *అసైన్డ్‌భూమి :* భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి. దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం కుదరదు. *ఆయకట్టు :* ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు. *బంజరు భూమి (బంచరామి) :* గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజావసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి. దీనిని రెవ
"Engineers build the nation." "Agriculture is a fundamental source of national prosperity."